ఆఫీస్ బాయ్ చెబితే 'హిట్లర్' కథ మార్చాను: ఎడిటర్ మోహన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆఫీస్ బాయ్ చెబితే 'హిట్లర్' కథ మార్చాను: ఎడిటర్ మోహన్

Editor Mohan Interview
  • చిరంజీవి హీరోగా నటించిన 'హిట్లర్'
  • డాన్సులు - ఫైట్లు యాడ్ చేశానన్న నిర్మాత 
  • అసలు పాయింటును బాయ్ పట్టేశాడని వెల్లడి 
  • తగిన మార్పులు చేశానని వ్యాఖ్య

ఎడిటర్ గా .. నిర్మాతగా మోహన్ కి మంచి అనుభవం ఉంది. ఆయన నుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. తాజాగా ఆయన 'ఐ డ్రీమ్'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'హిట్లర్' సినిమాను గురించి ప్రస్తావించారు. 'హిట్లర్' సినిమాను మలయాళంలో మమ్ముట్టి చేశారు. ఆ సినిమాను రిలీజ్ కి ముందు నాకు చూపించారు. ఆ సినిమా ఆడుతుందా లేదా అనే ఒక సందేహంలో వాళ్లు ఉన్నారు. 

"ఈ సినిమా మలయాళంలో తప్పకుండా ఆడుతుంది .. తెలుగు హక్కులను నేను తీసుకుంటాను' అని చెప్పాను. నేను అన్నట్టుగానే మలయాళంలో ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అలాగే తెలుగు హక్కులను నేను తీసుకున్నాను. మలయాళంలో మమ్ముట్టి డాన్సులు .. ఫైట్లు చేయలేదు. తెలుగులో అవి లేకపోతే ఆ సినిమా చూడరు. అందువలన నేను అవి ఉండేలా చూసుకున్నాను" అని అన్నారు. 

" మలయాళ సినిమాను గురించి నేను మా ఆఫీసులో మాట్లాడుతూ ఉంటే, గెస్టులకు టి - బిస్కెట్లు ఇస్తూ మా బాయ్ నా దగ్గరికి వచ్చాడు. 'తెలుగులో ఈ సినిమా ఆడదు సార్' అన్నాడు. ఆ మాటకి నేను కంగారుపడిపోయి 'ఎందుకు ఆడదు?' అని అడిగాను. చెల్లెళ్ల పట్ల హీరోకి ప్రేమ ఉంది .. కానీ వాళ్లకి పెళ్లిళ్లు చేయడు .. ఎవరైనా వాళ్లని ప్రేమిస్తే కొడతాడు .. మరి ఎట్లా సార్' అని అన్నాడు. కథలో అదే మెయిన్ పాయింట్. ఆ మాట నన్ను ఆలోచింపజేసింది .. అందుకే అందుకు సంబంధించిన మార్పులు కూడా చేశాను" అని చెప్పారు. 

Advertisement
Editor Mohan
Mammootty
Hitler

More Telugu News