ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ప్రశ్నించగా నాగచైతన్య సమాధానం ఇదే
తన పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది త్వరలోనే అందరికీ తెలుస్తుందని అన్నారు. ‘హైదరాబాద్‌లోనే మీ పెళ్లి జరుగుతుందా? అని ప్రశ్నించగా ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. నటి శోభితా ధూళిపాళ, నాగచైతన్యకు ఈ నెల 8న నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా పెళ్లి గురించి ప్రశ్నించగా ఈ సమాధానం ఇచ్చారు.
ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న తండేల్ సినిమాపై కూడా ఆయన స్పందించారు. తండేల్‌లో తన పాత్ర అత్యంత సవాల్‌తో కూడుకున్నదని, ఇది యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంటోందని అన్నారు. తన ప్రస్తుత లుక్ తండేల్ సినిమా కోసమేనని వెల్లడించారు. కాగా ఈ సినిమా చందూ మొండేటి డైరెక్షన్‌లో రూపొందుతోంది.