Chiranjeevi: తిరుమల శ్రీవారి సేవలో చిరంజీవి దంపతులు

Chiranjeevi in Tirumala
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి నేడు 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన బర్త్ డే సందర్భంగా ఆయన సతీ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. చిరంజీవి దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలను అందజేశారు. 1955 ఆగస్ట్ 22న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో చిరంజీవి జన్మించారు. మరోవైపు తమ అభిమాన నటుడి జన్మదినాన్ని పురస్కరించుకుని మెగ్యా ఫ్యాన్స్ భారీ కార్యక్రమాలను చేపడుతున్నారు. రక్తదానం, అన్నదానం తదితర సేవాకార్యక్రమాలను చేస్తున్నారు. విదేశాల్లో సైతం చిరు అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు.
Go Back to Shorts
Chiranjeevi
Tollywood
Tirumala

More Telugu News