జగన్ కు ఇదే నా ఛాలెంజ్: బుద్దా వెంకన్న

Budda Venkanna challenge to Jagan
  • వైసీపీ హయాంలో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందన్న బుద్దా వెంకన్న
  • తప్పులు బయటపడతాయనే భయంతో ఫైళ్లు తగులబెడుతున్నారని మండిపాటు
  • జగన్ కు భయపడి పెట్టుబడిదారులు ఏపీకీ రాలేదని వ్యాఖ్య
వైసీపీ హయాంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. అప్పుడు తప్పులు చేశారని, ఇప్పుడు ఆ తప్పులు బయటకు వస్తాయనే భయంతో ఫైళ్లను తగులబెడుతున్నారని అన్నారు. వైసీపీ హయాంలో ఉన్న వారంతా దండుపాళ్యం బ్యాచ్ అని ఎద్దేవా చేశారు. 

జగన్ కు తాను ఛాలెంజ్ చేస్తున్నానని... ఒక్క శాఖలోనైనా అవినీతి జరగలేదని ఆయన చెప్పగలరా? అని సవాల్ విసురుతున్నానని చెప్పారు. వైసీపీ హయాంలో అడ్డగోలుగా నియామకాలు జరిగాయని, ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్టులను కట్టబెట్టారని అన్నారు. వైసీపీ నేతలు, కొందరు అధికారులు కలిసి రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయాయని, జగన్ కు భయపడి ఒక్క పెట్టుబడిదారుడు కూడా ఏపీకి రాలేదని అన్నారు.
Advertisement
Budda Venkanna
Telugudesam
Jagan
YSRCP

More Telugu News