'రెడ్ బుక్' పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్

16-08-2024 Fri 15:00 | Andhra
Advertisement
  • ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటున్న వైసీపీ నేతలు
  • తాను ప్రతి సభలో రెడ్ బుక్ చూపించానన్న నారా లోకేశ్
  • ప్రజలు కూడా ఆమోదం తెలిపారని వెల్లడి
  • అద్భుతమైన తీర్పుతో తమను గెలిపించారని స్పష్టీకరణ
  • రెడ్ బుక్ కు ప్రజల మద్దతు ఉందంటూ లోకేశ్ పరోక్ష వ్యాఖ్యలు
Advertisement
ఏపీలో నారా లోకేశ్ 'రెడ్ బుక్' రాజ్యాంగం నడుస్తోందని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలే అందుకు కారణమని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. 

"రెడ్ బుక్ లో నేను ఏం చెప్పాను? ఓసారి పరిశీలించుకోండి. రెడ్ బుక్ గురించి ఇవాళ నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నా ప్రతి ప్రసంగం గమనించండి... ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్లని నేను వదిలిపెట్టను అని స్పష్టంగా చెప్పాను. మరోసారి చెబుతున్నాను... చట్టాలు ఉల్లంఘించినవాళ్లను వదిలిపెట్టను అని చెప్పాను. 

జోగి రమేశ్ గారి అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూముల పత్రాలు తీసుకుని, నకిలీ పత్రాలు సృష్టించి, అతడి పేరు మీద బదిలీ చేసుకుని, ఆ భూములను అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలామంది ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. వారికి రావాల్సిన డబ్బులు ఇంకా అందలేదు. అగ్రిగోల్డ్ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి, ఆ భూములు అమ్మేసి డబ్బులు సంపాదించాడు... అతడిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా? 

రేపు మద్యం వ్యవహారంలోనూ చర్యలు తీసుకుంటాం, ఇసుక దందాల్లోనూ చర్యలు తీసుకుంటాం. అడ్డగోలుగా ప్రజలు భూములు దోచేస్తే  మేం పట్టించుకోకూడదా? 

ఆ రోజు నేను ఊరూరా రెడ్ బుక్ గురించి మాట్లాడాను, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో వారిని నేను వదిలిపెట్టే ప్రశ్నే ఉండదు అని ప్రజలకు హామీ ఇచ్చాను. ప్రజలకు రెడ్ బుక్ చూపించి మరీ చెప్పాను... అందుకే ప్రజలు మాకు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. రెడ్ బుక్ వల్లే మేం గెలిచామని చెప్పడంలేదు... అందరి కృషి వల్ల గెలిచాం... అందులో రెడ్ బుక్ కూడా ఒక భాగం.

నేను వెళ్లిన ప్రతి నియోజకవర్గంలో గెలిచాం... అక్కడ నేను ప్రతి సభలో రెడ్ బుక్ చూపించాను. ఎవరైతే తప్పు చేశారో వారిని వదిలిపెట్టవద్దని ప్రజలు కూడా స్పష్టంగా మాకు తీర్పు ఇచ్చారు" అని నారా లోకేశ్ వివరించారు.
Advertisement
Nara LokeshRed BookTDP-JanaSena-BJP AllianceYSRCPAndhra Pradesh

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more