ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మ‌న స్వాతంత్య్రం: సీఎం చంద్ర‌బాబు

CM Chandrababu Naidu Independence Day Wishes
ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని ఆయ‌న పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని చంద్ర‌బాబు ఆకాంక్షించారు. 

"78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు నా శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం. వివిధ జాతులు, మతాలు, కులాలు కలిసి ఏకతాటిపై నడిచే అద్భుత దేశం మనది. ఎప్పటికప్పుడు నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ప్రగతిపథంలో సాగుతున్న మన దేశం ప్రపంచానికే ఆదర్శం. 

అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుంటూ, తాడితపీడిత ప్రజలకు అండగా నిలుస్తూ, బలహీనులకు ధైర్యాన్నిస్తూ ముందుకు సాగాలనేది పెద్దలు మనకు నేర్పిన పాఠం. అందుకు అనుగుణంగానే మనం అడుగులు వేస్తున్నాం. అభివృద్ధి ఫలాలను అందరికి అందించే బృహత్ బాధ్యతతో ముందుకు సాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ, ఈ స్వాతంత్య్ర దినోత్సవం జనజీవితాలకు కొత్త వెలుగులు పంచాలని మనసారా కోరుకుంటున్నాను" అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.
Go Back to Shorts
CM Chandrababu
Independence Day
Andhra Pradesh

More Telugu News