ఫిర్యాదు అందిన గంటలోనే వ్యక్తి ప్రాణం కాపాడిన హైదరాబాద్ పోలీసులు

13-08-2024 Tue 15:35 | Telangana
Advertisement
  • ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేసిన వ్యక్తి
  • కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మొబైల్ సిగ్నల్ ట్రేస్ చేసిన జగద్గిరిగుట్ట సీఐ
  • అతను ఎక్కడున్నాడో గుర్తించి ప్రాణాలు కాపాడిన పోలీసులు
  • అప్పటికే దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నం
  • గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించడంతో తప్పిన ప్రాణాపాయం
Advertisement
హైదరాబాద్ పోలీసులు ఓ కేసును గంటలోనే ఛేదించారు. దీంతో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడగలిగారు. టెక్నాలజీ సహాయంతో వారు ఈ కేసును అత్యంత వేగంగా పరిష్కరించారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరప్ప నగర్‌కు చెందిన మాలంపాక బాబీ ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

సోమవారం మధ్యాహ్నం తాను డ్యూటీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వచ్చాడు. కానీ ఆ తర్వాత తన బావమరిదికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి... ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆ బావమరిది పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు అందిన వెంటనే జగద్గిరిగుట్ట సీఐ క్రాంతి కుమార్ స్పందించారు. అతని మొబైల్ సిగ్నల్‌ను ట్రేస్ చేశారు. సికింద్రాబాద్ మహంకాళీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. సిబ్బందిని అక్కడకు పంపించారు. ఓ లాడ్జిలో బాబీని గుర్తించారు. అప్పటికే అతను దోమలమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
Advertisement
HyderabadPolice

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more