Team India: మూడో వన్డేలో భారీ స్కోరు దిశగా శ్రీలంక

సిరీస్ ఫలితం తేల్చే మూడో వన్డేలో ఆతిథ్య శ్రీలంక జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య నేడు చివరి వన్డే జరుగుతోంది. కొలంబోలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక 33 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో 90, వన్ డౌన్ బ్యాట్స్ మన్ కుశాల్ మెండిస్ 20 పరుగులతో ఆడుతున్నారు. మరో ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 45 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడికే వికెట్ దక్కింది. 
Team India
Sri Lanka
3rd ODI

More Telugu News