ఆసక్తికర వీడియో పోస్టు చేసిన తెలంగాణ ఏసీబీ చీఫ్ సీవీ ఆనంద్
Add ap7am to your home Screen

ఆసక్తికర వీడియో పోస్టు చేసిన తెలంగాణ ఏసీబీ చీఫ్ సీవీ ఆనంద్

Telangana ACB DG CV Anand shares an interesting video
తెలంగాణ ఏసీబీ చీఫ్ సీవీ ఆనంద్ సోషల్ మీడియాలో పంచుకున్న ఓ వీడియో ఇప్పుడందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక కోతి కూడా టేబుల్ పై కూర్చుని ఫైళ్లు తిరగేస్తూ ఉండడం ఆ వీడియోలో చూడొచ్చు.  తినడానికి అరటిపండు పెట్టినా, దాని జోలికి వెళ్లకుండా ఫైళ్లు పరిశీలిస్తూ ఆ కోతి యమా బిజీగా ఉండడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియోపై సీవీ ఆనంద్ సరదాగా వ్యాఖ్యానించారు. "అవినీతి అధికారులకు వల విసరడం, వారిని అరెస్ట్ చేయడం నుంచి కాస్త విరామం. ప్రలోభాలకు ఏమాత్రం లొంగని స్ట్రిక్ట్ ఆఫీసర్ రికార్డులను ఎలా తనిఖీ చేస్తున్నారో చూడండి" అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Advertisement
CV Anand
Video
Monkey
Strict Officer

More Telugu News