ఇవిగో... ఈ విజ్ఞప్తులు మీకు పంపిస్తున్నాను: రేవంత్ కార్యాలయానికి హరీశ్ రావు ట్వీట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇవిగో... ఈ విజ్ఞప్తులు మీకు పంపిస్తున్నాను: రేవంత్ కార్యాలయానికి హరీశ్ రావు ట్వీట్

Harish Rao raises question over loan waiver
  • రుణమాఫీ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభించడంతో కొత్త సమస్యలు వచ్చాయన్న హరీశ్ రావు
  • 7 నెలల వడ్డీని చెల్లించాకే రుణమాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తున్నారని ఆగ్రహం
  • మెదక్ జిల్లాలో రూ.9 వేలు వడ్డీ కట్టించుకున్నాకే రుణమాఫీ చేశారన్న హరీశ్ రావు
రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వడ్డీ చెల్లించాకే రుణమాఫీ చేస్తామని రైతులకు వేధింపులు వస్తున్నాయని, తన దృష్టికి వచ్చిన విజ్ఞప్తులను మీకు పంపిస్తున్నానంటూ రేవంత్ రెడ్డి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.

 ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ముందుగా 7 నెలల వడ్డీ చెల్లించాకే, రుణమాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు... వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని రైతులు బాధపడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జులై దాకా వడ్డీని తామే భరిస్తామనీ, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు క్రాప్ లోన్‌ను... రూ.9000 వడ్డీని కట్టించుకున్నాకే బ్యాంకు అధికారులు క్లోజ్ చేశారని ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందన్నారు. తనకు రైతులు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నాను. పరిష్కరించాలని కోరుతున్నానని తెలంగాణ సీఎంవోకు ట్యాగ్ చేశారు.
Advertisement
Harish Rao
BRS
Loan Waiver
Revanth Reddy

More Telugu News