నువ్వొక మహిళవు.. అసలు నీకేమైనా తెలుసా?.. అసెంబ్లీలో నితీశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
- బీహార్‌లో ప్రత్యేక హోదా దక్కకపోవడంపై సభలో ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన
- సీఎం నితీశ్ మాట్లాడుతుండగా నిరసనగా నినాదాలు
- సహనం కోల్పోయి మహిళా ఎమ్మెల్యేపై చిందులు
సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై విపక్ష నేత, ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ మండిపడ్డారు. మహిళలపై వ్యాఖ్యలు చేసే విషయంలో ఆయన నేరప్రవృత్తిని ప్రదర్శిస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు అవాంఛనీయం, అనాగరికం, అసభ్యకరం, నీచమైనవని ఆయన విమర్శించారు. స్త్రీలను అగౌరవపరిచే వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని తేజస్వి యాదవ్ అన్నారు. ఆయన వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల క్రితం గిరిజన వర్గానికి చెందిన బీజేపీ మహిళా ఎమ్మెల్యే అందంపై నితీశ్ కుమార్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని తేజస్వి యాదవ్ ప్రస్తావించారు.