Kilari Rosaiah: వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య

గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి వైసీపీకి రాజీనామా చేయగా... ఇప్పుడదే బాటలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య కూడా నడిచారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు రోశయ్య నేడు ఒక ప్రకటనలో తెలియజేశారు. 

ఇవాళ ఆయన గుంటూరులో తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. వైసీపీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉండడంలేదని, పార్టీ కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కూడా వారి ఇష్ట ప్రకారమే పార్టీ నడుస్తోందని ఆరోపించారు. 

ఎన్నికల్లో తనను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారని, కొందరు తనను మానసికంగా కుంగదీశారని కిలారు రోశయ్య వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను వైసీపీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. సీనియర్ నేత ఉమ్మారెడ్డికి సైతం పార్టీలో అన్యాయం జరిగిందని అన్నారు.
Kilari Rosaiah
YSRCP
Resignation
Ponnuru
Guntur District

More Telugu News