ఏపీ హోంమంత్రిపై విజయసాయిరెడ్డి ఫైర్
- స్వయంగా మంత్రి అనిత తుపాకీ పట్టుకోమంటోందని విమర్శ
- అంతుచూస్తామని చెప్పినట్లే చేసి చూపిస్తున్నారని ఆరోపణ
- ప్రభుత్వం ఇంతటి హింసకు దిగజారుతుందని అనుకోలేదని వ్యాఖ్య
తుపాకీ పట్టుకోవాలంటూ స్వయంగా ఏపీ హోంమంత్రి అనిత సూచించడం దేనికి సంకేతమని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ముందు ‘అంతుచూస్తా’.. ‘పాదాలతో తొక్కేస్తా’ అంటే రాజకీయ కక్షతో మాట్లాడుతున్నారని అనుకున్నామని, ప్రభుత్వం ఏర్పడ్డాక నిజంగానే చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇలా హింసకు దిగజారుతుందని అనుకోలేదని, టీడీపీ హత్యారాజకీయాలతో ఇటు ప్రజలు, అటు పోలీసు యంత్రాంగం కూడా బెంబేలెత్తిపోతోందని విజయసాయి రెడ్డి ఆరోపించారు.