Sai Durga Tej: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగా హీరో సాయి దుర్గా తేజ్

Mega hero Sai Durga Tej met CM Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల ఓ తండ్రి, కూతురుకు సంబంధించిన వీడియోపై సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అనుచితంగా వీడియో చాట్ చేసిన ఘటన అందరికీ తెలిసిందే. టాలీవుడ్ హీరో సాయి దుర్గా తేజ్ ఈ వీడియో విషయాన్ని తెరపైకి తెచ్చారు. 

తమ పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పోస్టు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన సాయి దుర్గా తేజ్... అదే సమయంలో, సోషల్ మీడియాలో అరాచకాలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా, ఇదే అంశంపై సాయి దుర్గా తేజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీనిపై ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వివరాలు తెలిపారు. 

"నా కోసం మీ విలువైన సమయం కేటాయించినందుకు థాంక్యూ సీఎం రేవంత్ అన్న... పిల్లలపై అకృత్యాలు, సోషల్ మీడియా దుర్వినియోగం తదితర అంశాలపై నేను చెప్పింది విని, అర్థం చేసుకుని, దీనిపై ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నదానిపై చర్చించినందుకు మీకు ధన్యవాదాలు. మన సమాజాన్ని పిల్లలకు సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి వీలు కల్పించే కఠినమైన నిబంధనలు, చర్యలకు శ్రీకారం చుడతామని మీరు హామీ ఇవ్వడం అభినందనీయం. సత్వరమే స్పందించి న్యాయం చేసేందుకు మీరు చూపిన నిబద్ధతకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి సమస్యలపై నా సర్వశక్తులు ఒడ్డి పోరాడడం ఇక ముందు కూడా కొనసాగుతుంది" అని సాయి దుర్గా తేజ్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు.
Go Back to Shorts
Sai Durga Tej
Revanth Reddy
Child Abuse
Video
Social Media
Tollywood
Telangana

More Telugu News