అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి.. ఫొటోలు ఇవిగో!

Chandrababu and Nara Bhuvaneswari attends Anant Ambani Radhika Merchant wedding reception
రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ పరిణయ మహోత్సవం నేపథ్యంలో, నేడు అతి ముఖ్యమైన అతిథులకు అంబానీ కుటుంబం 'శుభ్ ఆశీర్వాద్' పేరుతో విందు ఏర్పాటు చేసింది. 

ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు హాజరయ్యారు. నూతన దంపతులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లను చంద్రబాబు ఆశీర్వదించారు. ముఖేశ్ అంబానీ స్వయంగా తన కుమారుడు, కోడలిని చంద్రబాబు దంపతులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడే ఉన్నారు.

 ఏపీ మంత్రి నారా లోకేశ్, నారా బ్రాహ్మణి కూడా ఈ రిసెప్షన్ కు విచ్చేశారు. నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ లతో చంద్రబాబు ముచ్చటించడం ఓ వీడియోలో కనిపించింది. ఈ రిసెప్షన్ కు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఫిఫా అధ్యక్షడు గియాన్నీ ఇన్ఫాంటినో వంటి ప్రపంచ ప్రముఖులు సైతం అంబానీ ఇంట సంబరాలకు హాజరయ్యారు. 

అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, సానియా మీర్జా, షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, సుహానా ఖాన్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, రజనీకాంత్, మహేశ్ బాబు, ధోనీ, కేఎల్ రాహుల్, అతియా శెట్టి, అహాన్ శెట్టి, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, అజయ దేవగణ్, సారా అలీఖాన్, హేమమాలిని, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రిషబ్ పంత్, మిస్ వరల్డ్ మానుషి చిల్లర్, అనన్య పాండే, షనాయా కపూర్, దిశా పటానీ తదితరులు కూడా అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమానికి విచ్చేశారు.
Go Back to Shorts
Chandrababu
Nara Bhuvaneswari
Anant Ambani
Radhika Merchant
Wedding Reception

More Telugu News