ఇది నా పూర్వజన్మ సుకృతం: మోహన్ బాబు

Mohan Babu Special
  • అంచలంచెలుగా ఎదిగిన మోహన్ బాబు
  • విద్యాలయాల స్థాపన పట్ల అంకితభావం 
  • ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి
  • రాజదండంతో కనిపించిన మోహన్ బాబు 
  • త్వరలో ఆ విషయాలు చెబుతానని వెల్లడి    

తెలుగు సినిమా పరిశ్రమలో మోహన్ బాబు స్థానం ప్రత్యేకం. మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. విలనిజం విషయంలో తనదైన ముద్రవేసిన ఆయన, ఆ తరువాత హీరోగా తన సత్తా చాటుకున్నారు. విలన్ గా చేసి ఆ వెంటనే హీరోగా తారస్థాయికి చేరుకున్న అరుదైన ఆర్టిస్టులలో ఆయన ఒకరుగా కనిపిస్తారు. 

అలాంటి మోహన్ బాబు ఆ తరువాత కాలంలో నిర్మాతగాను అనేక విజయాలను అందుకున్నారు. ఇక ఆ తరువాత విద్యాలయాలను నిర్మిస్తూ .. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల పట్ల కూడా ఆసక్తిని కనబరుస్తూ వెళుతున్నారు. అలాంటి ఆయన 'రాజదండం'తో కూడిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 భక్తి భావంతో భుజంపై 'రాజదండం' పెట్టుకున్న మోహన్ బాబులో, దాని పట్ల గౌరవభావం స్పష్టమవుతోంది. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ అపురూప రాజదండం తనకి అందడం తన పూర్వజన్మ సుకృతమనీ, అలాంటి రాజదండాన్ని స్పర్శించే భాగ్యం లభించడం తన అదృష్టమని మోహన్ బాబు రాసుకొచ్చారు. ఈ రాజదండం తనకి ఎప్పుడు వచ్చిందో .. ఎలా వచ్చిందో అనే వివరాలను త్వరలోనే తెలియపరుస్తానంటూ అభిమానులలో ఆయన ఆసక్తిని పెంచారు. 
Advertisement
Mohan Babu
Actor
Tollywood

More Telugu News