ఆంధ్రప్రదేశ్‌లో 19 మంది ఐఏఎస్‌ల బదిలీ

11-07-2024 Thu 17:59 | Andhra
Advertisement
  • ఇద్దరు ఐపీఎస్ అధికారులనూ బదిలీ చేసిన ప్రభుత్వం
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ 
  • గ్రామ వార్డు సచివాలయం అదనపు బాధ్యతలు సురేశ్ కుమార్‌కు అప్పగింత
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో 19 మంది ఐఏఎస్‌లను, ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి.అనంతరాము, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా, సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్‌గా జి.జయలక్ష్మి, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా కాంతిలాల్ దండే, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కార్యదర్శిగా సురేశ్ కుమార్‌లను బదిలీ చేశారు. సురేశ్ కుమార్‌కు గ్రామ వార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. జీఏడీ కార్యదర్శిగా కూడా సురేశ్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు.

ఐటీ శాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శిగా యువరాజ్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా హర్షవర్ధన్, వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్యదర్శిగా పి.భాస్కర్‌లను బదిలీ చేశారు. పి.భాస్కర్‌కు ఈడబ్ల్యుఎస్, జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలను అప్పగించారు.

సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా కె.కన్నబాబును బదిలీ చేశారు. ఆయనకు గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గాను బాధ్యతలు అప్పగించారు.

వినయ్ చంద్‌ను పర్యాటక శాఖ కార్యదర్శిగా, వివేక్ యాదవ్‌ను యువజన సర్వీసులు, క్రీడల శాఖ కార్యదర్శిగా, సూర్యకుమారిని మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ కార్యదర్శిగా, సి.శ్రీధర్‌ను ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.

జె.నివాస్‌కు ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా, విజయరామరాజుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా, ఢిల్లీరావుకు వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. హిమాంశు శుక్లాకు సమాచార, పౌరసంబంధాల శాఖ బాధ్యతలను అప్పగించారు. వ్యవసాయ శాఖ నుంచి హరికిరణ్‌ను బదిలీ చేశారు. గిరిజా శంకర్‌ను ఆర్థిక శాఖ నుంచి రిలీవ్ చేశారు.
Advertisement
Andhra PradeshIASIPSAP Government

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more