ఐదుగురు భార్యలతో 'నాగేంద్రన్స్ హనీమూన్స్'

Nagendrans Honeymoons OTT releasedate confirmed
  • సూరజ్ ప్రధాన పాత్రగా 'నాగేంద్రన్స్ హనీమూన్స్' 
  • ఆయన కెరియర్లో ఇదే ఫస్టు వెబ్ సిరీస్ 
  • ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ 
  • అందుబాటులో తెలుగు .. తమిళ వెర్షన్స్ కూడా

మలయాళంలో సూరజ్ వెంజరమూడుకి మంచి క్రేజ్ ఉంది. ఆయన తన కెరియర్ ను మొదలుపెట్టి 20 ఏళ్లకి పైగా అయింది. సుదీర్ఘమైన ఈ కెరియర్లో ఆయన తన ఎన్నో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ .. విలక్షణమైన పాత్రలను చేసుకుంటూ వచ్చారు. తన కెరియర్లో మొదటిసారిగా ఆయన ఓ వెబ్ సిరీస్ కూడా చేశాడు. 

సూరజ్ చేసిన ఆ వెబ్ సిరీస్ పేరే 'నాగేంద్రన్స్ హనీమూన్'. గతంలో 'కేరళ ఫైల్స్' ను నిర్మించిన నితిన్ రెంజీ పనికర్ ఈ సిరీస్ కి దర్శక నిర్మాతగా వ్యవహరించారు. ఈ సిరీస్ కి రచయితగా కూడా ఆయనే వ్యవహరించడం విశేషం. కామెడీ డ్రామా జోనర్లో రూపొందిన ఈ సిరీస్, ఈ నెల 19వ తేదీ నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

నాగేంద్రన్ కి గల్ఫ్ కి వెళ్లాలనే కోరిక బలంగా ఉంటుంది. అక్కడికి వెళ్లి డబ్బు బాగా సంపాదించి, జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలనే కోరిక ఉంటుంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే, ఒకదాని తరువాత ఒకటిగా ఆయన ఐదు పెళ్లిళ్లు చేసుకోవలసి వస్తుంది. అందుకు దారితీసిన పరిస్థితులేమిటి? ఆయన కోరిక నెరవేరిందా? లేదా? అనేది కథ. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ ప్రేక్షకులను ఈ సిరీస్ అలరించనుంది. 
Go Back to Shorts
Suraj Venjaramoodu
Grace Antony
Shwetha Menon
Nagendrans Honeymoons

More Telugu News