'బాలీవుడ్ నటితో కుల్దీప్ యాదవ్ పెళ్లి' అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన క్రికెటర్
- తాను నటిని పెళ్లి చేసుకోవడం లేదంటూ ఊహాగానాలకు చెక్ పెట్టిన స్పిన్నర్
- త్వరలోనే తన వివాహం ఉంటుందని వెల్లడి
- కాబోయే భార్య తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమన్న కుల్దీప్
టీ20 వరల్డ్ కప్ 2024 విజేత జట్టుకు ముంబైలో ఊరేగింపు, సన్మానం తర్వాత ఒక రోజు ముంబైలో విశ్రాంతి తీసుకొని స్వస్థలమైన కాన్పూర్‌కు కుల్దీప్ యాదవ్ చేరుకున్నాడు. కాన్పూర్‌లో అతడికి ఘన స్వాగతం లభించింది. వందలాది మంది అభిమానులు అతడికి స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చి, డబ్బు వాయిద్యాలతో కుల్దీప్‌కు స్వాగతం పలికారు
ఈ విధంగా స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉందని, చాలా గొప్పగా అనిపిస్తోందని అన్నాడు. ప్రపంచ కప్ తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా కంటే భారత్ కప్పు గెలవడం చాలా ముఖ్యమని, ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవడం సంతోషంగా ఉందని ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఇంటికి చేరుకున్న కుల్దీప్ యాదవ్ టీ20 వరల్డ్ కప్ విజేత మెడల్‌ను తన తల్లి మెడలో వేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.