రోహిత్ ఫోన్ చేయడం వల్లే కోచ్‌గా ఉన్నా.. అందుకు ధన్యవాదాలు: రాహుల్ ద్రవిడ్
- కోచ్ ద్రవిడ్ మాట్లాడిన ఫైనల్ స్పీచ్ వీడియోను పంచుకున్న బీసీసీఐ
- వరల్డ్‌కప్ విజయంలో తాను భాగమవ్వడం గుర్తుండిపోయే మెమోరీ అన్న ద్రవిడ్
- ఈ విజయాన్ని చేరుకోవడంలో ప్రతి ఒక్కరూ అనేక త్యాగాలు చేశారని వ్యాఖ్య
- గతేడాది వన్డే ప్రపంచకప్ ఓటమి తర్వాత కోచ్‌గా తప్పుకోవాలనుకున్న రాహుల్
- కనీసం టీ20 వరల్డ్‌కప్ వరకు అయినా కోచ్‌గా కొనసాగాలని రోహిత్ ఫోన్
- ఆ ఫోన్ కాల్‌తో తన నిర్ణయం మార్చుకున్నట్లు వెల్లడి
రోహిత్ అడగడంతో నిర్ణయం మార్చుకున్నా..
టీ20 వరల్డ్‌కప్ విజయంతో రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవికి ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే, రోహిత్ శర్మ తనకు కాల్ చేయకపోయి ఉంటే తాను కోచ్‌గా కొనసాగేవాడిని కాదని ఆయన డ్రెస్సింగ్ రూమ్ ఫైనల్ స్పీచ్‌లో వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పరాజయం తర్వాత ద్రవిడ్ కోచ్‌గా తప్పుకోవాలనుకున్నారట. కానీ, కనీసం టీ20 వరల్డ్‌కప్ వరకు అయినా కోచ్‌గా కొనసాగాలని రోహిత్ శర్మ ఫోన్ చేసి అడగడంతో తన నిర్ణయం మార్చుకున్నట్లు ఆయన తెలిపారు. అందుకే ఇప్పుడు తాను కూడా ప్రపంచకప్ విజయంలో భాగమయ్యానని, అందుకు రోహిత్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.