తల్లీకూతుర్లను గదిలో బంధించి అడ్డుగోడ కట్టేసిన బంధువులు
- ఆస్తి వివాదంలో చోటుచేసుకున్న షాకింగ్ ఘటన
- సమాచారం అందడంతో వచ్చి గోడను బద్దలు కొట్టిన పోలీసులు
- ప్రాణాలతో బయటపడ్డ తల్లీకూతుర్లు
- పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఘటన
సుహైల్ అనే తన బావ, అతడి కుమారులతో కలిసి తాము బయటకు రాకుండా ఒక గదిలో బంధించి గోడ నిర్మించారని బాధిత మహిళ తెలిపింది. ఆస్తి తగాదా నేపథ్యంలో సుహైల్‌ను నిత్యం వేధిస్తున్నాడని ఆమె చెప్పారు. ఇంటికి సంబంధించిన కీలకమైన పత్రాలు తన వద్ద ఉన్నాయని చెబుతున్నాడని ఆమె పేర్కొన్నారు.
నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. బాధ్యులను కచ్చితంగా పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫరూఖ్ లిన్జార్ ప్రకటించారు.