ఏపీలో రేపు 10 వేల కేంద్రాల్లో 'మన్ కీ బాత్': పురందేశ్వరి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి 'మన్ కీ బాత్' పేరిట ప్రసారమాధ్యమాల ద్వారా ప్రసంగించడం ఆనవాయతీగా వస్తోంది.
ఎన్డీయే 3.0 ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక రేపు తొలిసారిగా 'మన్ కీ బాత్' నిర్వహిస్తుండడంతో ప్రాధాన్యత ఏర్పడింది.
ఇక, రాజమండ్రిలో జులై 8న బీజేపీ రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం ఉంటుందని పురందేశ్వరి తెలిపారు.