రేపు పోలవరం ప్రాజెక్టు వద్దకు అంతర్జాతీయ నిపుణుల బృందం రాక

రేపు పోలవరం ప్రాజెక్టు వద్దకు అంతర్జాతీయ నిపుణుల బృందం రాక

International experts will visit Polavaram Project tomorrow
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై నిన్న శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రాజెక్టు పురోగతి దిశగా కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు. రేపు (జూన్ 30) పోలవరం ప్రాజెక్టు వద్దకు అంతర్జాతీయ నిపుణుల బృందం రానుంది. ఈ బృందం పోలవరం ప్రాజెక్టును నాలుగు రోజుల పాటు నిశితంగా పరిశీలిస్తుంది. కాఫర్ డ్యామ్ లు, డయాఫ్రమ్ వాల్ ప్రస్తుత పరిస్థితిని ఈ బృందం అంచనా వేయనుంది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఈ అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.
Advertisement
Polavaram Project
International Experts
AP Govt
Chandrababu
Andhra Pradesh

More Telugu News