మంత్రిగా లోకేశ్ తొలి సంతకం దేనిపైనంటే..!
- 16 వేల పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం
- విద్యా శాఖ మంత్రిగా మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం చేసిన లోకేశ్
- ఆర్భాటాలు వద్దంటూ తన కుర్చీకి చుట్టిన టవల్ తీసేసిన మంత్రి
విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ కూడా అదే ఫైలుపై తొలి సంతకం చేశారు. అంతకుముందు సచివాలయంలో మంత్రి లోకేశ్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన మంత్రి లోకేశ్ కు సహచర మంత్రులు నిమ్మల రామానాయుడు, రాంప్రసాద్ రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎంపీ కనకమేడల, పార్టీ ఎమ్మెల్యేలు తదితరులు అభినందనలు తెలిపారు.