పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్.. కాంగ్రెస్‌లోకి ఆహ్వానం!

తెలంగాణ‌లో బీఆర్ఎస్‌కు మ‌రో షాక్ త‌గిలే అవ‌కాశం ఉంది. అసెంబ్లీ మాజీ స్పీక‌ర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. వీరి భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. తాజా రాజ‌కీయాల‌పై చ‌ర్చ‌ల అనంత‌రం పోచారంను కాంగ్రెస్‌లో చేరాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం. దీంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి హ‌స్తం గూటికి చేర‌డం దాదాపు ఖాయ‌మైన‌ట్టేన‌ని చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం పోచారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.

Revanth Reddy
Pocharam Srinivas Reddy
Telangana
BRS
Congress

More Telugu News