బాధ్యతల అప్పగింతకు ముందే సామగ్రి తరలించేసిన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి

  • ఈ నెల 11న ధర్మారెడ్డికి సెలవు మంజూరు చేసిన కొత్త ప్రభుత్వం
  • అదే రోజు తిరుమలలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సామగ్రి తరలింపు
  • గుట్టు చప్పుడు కాకుండా తరలింపుపై అనుమానాలు
బాధ్యతలు అప్పగించడానికి ముందే తన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసి, సామగ్రిని తరలించిన తిరుమల తిరుపతి మాజీ ఈవో ధర్మారెడ్డిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈ నెల 11న ధర్మారెడ్డికి సెలవు మంజూరు చేసింది. 

అదే రోజు ఆయన తిరుమలలోని తన క్యాంపు కార్యాలయం నుంచి తనకు సంబంధించిన వస్తువులు, సామగ్రిని రెండు ట్రక్కుల్లో తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కొత్త ఈవోకు బాధ్యతలు అప్పగించిన తర్వాత క్యాంపు కార్యాలయాలు ఖాళీ చేస్తుంటారు. అయితే, ధర్మారెడ్డి మాత్రం ప్రభుత్వం తనకు సెలవు మంజూరు చేసిన రోజే గుట్టుగా తన కార్యాలయాన్ని ఖాళీ చేయడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Dharma Reddy
TTD EO
Tirumala
Andhra Pradesh

More Telugu News