Advertisement

జోగి రమేశ్ ఇంటిపై యువకుల రాళ్ల దాడి

stones pelted on Jogi ramesh house in ntr district
  • ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆదివారం మధ్యాహ్నం ఘటన
  • కారులో వచ్చి రాళ్లు రువ్విన గుర్తు తెలియని యువకులు
  • పోలీసులు అడ్డుకోవడంతో పారిపోయిన నిందితులు
  • యువకులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్న ఇబ్రహీంపట్నం సీఐ
మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై కొందరు యువకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఫెర్రీ నుంచి రింగుకూడలికి వెళ్లే మార్గంలో మాజీ మంత్రి నూతన గృహం ఉంది. అయితే, ఆదివారం మధ్యాహ్నం ఆ రహదారిలో కొందరు యువకులు కారులో వచ్చి ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇది గమనించిన పోలీసు సిబ్బంది ఒకరు వారిని అడ్డుకున్నారు. కాసేపటికి స్థానికులూ రావడంతో యువకులు కారులో పారిపోయారు. ఘటన జరిగిన సమయంలో ఆ నివాసంలో ఎవరూ లేరు. అయితే, జోగి రమేశ్ ఇంటి వద్ద ఇనుప కంచె ఏర్పాటు చేసి సిబ్బందికి విధులు కేటాయించామని ఇబ్రహీంపట్నం సీఐ తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.
Advertisement
Jogi Ramesh
Stone pelting
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News