ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం... మారిన పీఎఫ్ విత్ డ్రా రూల్స్
- కరోనా సమయంలో తీసుకువచ్చిన అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేసిన ఈపీఎఫ్ఓ
- కరోనా నేపథ్యంలో ఈపీఎఫ్ ఖాతా నుంచి 75 శాతం నగదు తీసుకునే వెసులుబాటు
- కరోనా పూర్తిగా తగ్గిన నేపథ్యంలో నిబంధనలు మార్చిన ఈపీఎఫ్ఓ
2020లో కరోనా మొదటి వేవ్ సమయంలో ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది. రెండో వేవ్ వచ్చినప్పుడు దీనిని పునరుద్ధరించారు. దాదాపు నాలుగేళ్లు ఇది అందుబాటులో ఉంది. తొలుత ఒకసారి మాత్రమే అడ్వాన్స్ తీసుకునే వెసులుబాటు కల్పించినప్పటికీ... ఆ తర్వాత పలుమార్లు పునరుద్ధరించారు. ఇప్పుడు దీనిని నిలిపివేశారు. అడ్వాన్స్ సదుపాయం నిలిచిపోయినప్పటికీ ఇంటి కొనుగోలు, పిల్లల ఉన్నత చదువులు, ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం వంటి సందర్భాల్లో ఈపీఎఫ్ ఖాతాలోని నిర్దిష్ట పరిమితి మేరకు ఉపసంహరించుకోవచ్చు.