వేదిక వద్దకు చేరుకున్న నారా లోకేశ్, భువనేశ్వరి... నోవాటెల్ నుంచి బయల్దేరిన అమిత్ షా, నడ్డా

12-06-2024 Wed 10:55 | Andhra
Advertisement
  • కాసేపట్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం
  • ఉదయం 11.27 గంటలకు సీఎంగా ప్రమాణం చేయనున్న చంద్రబాబు
  • చంద్రబాబుతో పాటు ప్రమాణం చేయనున్న 24 మంది మంత్రులు
Advertisement
ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఉదయం 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రముఖులు భారీగా తరలివస్తున్నారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేశ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి కూడా ఇప్పటికే వేదిక వద్దకు చేరుకున్నారు. నందమూరి చైతన్యకృష్ణ, నారా రోహిత్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. 

అటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి  జేపీ నడ్డా విజయవాడలోని నోవాటెల్ హోటల్ నుంచి కేసరపల్లి ఐటీ పార్కుకు బయల్దేరారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. 

చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద 14 ఎకరాల్లో సభా ప్రాంగణం, 65 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రముఖులు, వివిధ దేశాల కాన్సులేట్ జనరల్స్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో, 7 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
Advertisement
ChandrababuOath TakingNara LokeshNara BhuvaneswariNara BrahmaniTDP MahanaduAndhra Pradesh

More Telugu News

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28
..more