సీఎం హోదాలో ఇవాళ సాయంత్రం తిరుమలకు చంద్రబాబు
- కుటుంబంతో కలిసి వెళ్లనున్న టీడీపీ అధినేత
- బుధవారం రాత్రి అక్కడే బస.. గురువారం ఉదయం శ్రీవారి దర్శనం
- రేపు తిరిగి అమరావతి చేరుకోనున్న చంద్రబాబు
కాగా ఈరోజు ఉదయం 11.27 గంటకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నాలుగవ సారి సీఎంగా ఆయన ప్రమాణం చేయనున్నారు. కాగా 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1980 నుంచి 1983 వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా తొలిసారి చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. 1999లో రెండోసారి, 2014-19 వరకు మూడోసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇక 2004 నుంచి 2014 వరకు, 2019-2024 వరకు ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించారు.