Chiranjeevi: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏపీ విశిష్ట అతిథిగా చిరంజీవికి ఆహ్వానం

Chiranjeevi and Ram Charan to attend Chandrababu swearing in ceremony as CM
షార్ట్స్‌లో చూడండి
 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా హాజరు కావాలని కోరుతూ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది.

ఈ క్రమంలో చిరంజీవి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు. అక్కడి నుంచి రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళతారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ కూడా హాజరు కానున్నారు. చంద్రబాబు రేపు ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 
Go Back to Shorts
Chiranjeevi
Chandrababu
Andhra Pradesh

More Telugu News