మంత్రి పొన్నం ప్రభాకర్‌పై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

Padi Kaushik Reddy allegations on Ponnam Prabhakar
  • ఎన్టీపీసీ నుంచి ఫైయాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న ఎమ్మెల్యే
  • ఈ వ్యవహారంలో మంత్రికి రోజుకి రూ.50 లక్షలు ముడుతున్నాయని ఆరోపణ
  • తాను లారీలను పట్టుకుంటే రెండింటిని మాత్రమే సీజ్ చేసి... మిగతా వాటిని వదిలేశారని వెల్లడి
పరిమితికి మించి ఫ్లైయాష్‌ను తరలిస్తూ... లారీలు ఓవర్ లోడ్‌తో వెళుతున్నాయని, ఈ వ్యవహారంలో మంత్రికి రోజుకు రూ.50 లక్షలు ముడుతున్నాయని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్టీపీసీ నుంచి ఫైయాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి భారీ కుంభకోణం జరుగుతోందన్నారు. ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు.

రెట్టింపు పరిమాణం ఫ్లైయాష్‌తో లారీలు వెళుతున్నాయని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు అనూప్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తాను స్వయంగా లారీలను పట్టుకుంటే రెండు లారీలను మాత్రమే సీజ్ చేసి మిగతా వాటిని వదిలి పెట్టారని అన్నారు. పొన్నం ప్రభాకర్ ఫోన్ చేయడం వల్లే అధికారులు లారీలను వదిలి పెట్టారని ఆరోపించారు.
Advertisement
Padi Kaushik Reddy
BRS

More Telugu News