అర్ధరాత్రి గ‌నుల శాఖ‌, ఏపీఎండీసీ కార్యాల‌యాలు సీజ్

09-06-2024 Sun 07:53 | Andhra
Advertisement
  • గనుల శాఖ డెరెక్టర్‌గా, ఎండీసీ ఎండీగా యువరాజ్‌ బాధ్యతల స్వీకరణ
  • ఇప్ప‌టికే ఏపీఎండీసీ వైస్ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డిపై బ‌దిలీ వేటు
  • గ‌నుల శాఖ‌పై వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో భారీ అవినీతి జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు
Advertisement
గనుల శాఖ డైరెక్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) వైస్ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా జంట ప‌ద‌వులు నిర్వ‌హిస్తున్న‌ వెంకటరెడ్డిపై శుక్రవారం రాత్రే ప్రభుత్వం బ‌దిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. అలా ఆయ‌న బ‌దిలీ అయిన వెంట‌నే పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. 

అర్ధ‌రాత్రి ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలోని గ‌నుల‌శాఖ కార్యాల‌యం, తాడిగ‌డ‌ప స‌మీపంలోని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాల‌ను ప్రభుత్వం త‌మ అధీనంలోకి తీసుకుని సీజ్‌ చేసింది. కార్యాలయంలోని అన్ని విభాగాలను పోలీసులు సోదాలు చేసి పూర్తిగా త‌మ‌ స్వాధీనంలోకి తీసుకున్నారు. 

కీలకమైన ఫైళ్లు, హార్డ్‌డిస్క్‌లు, ఇతర సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకే ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స‌మాచారం. ప్రభుత్వం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వరకు ఆఫీసు మూసేఉంటుందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.

కాగా, గ‌నుల శాఖ ఆధ్వ‌ర్యంలో ఇష్టానుసారంగా బీచ్‌శాండ్‌, బెరైటీస్‌, ఇసుక, బొగ్గు, ఇతర ఖనిజాల వేలం, టెండర్లు, అమ్మకాలు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌ద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. వైసీపీ ముఖ్యుల‌కు వెంక‌ట‌రెడ్డి భారీ ల‌బ్ధి చేకూర్చార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 

మరోవైపు గనుల శాఖ డెరెక్టర్‌గా, ఎండీసీ ఎండీగా యువరాజ్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీఐఐసీ భవనంలోని తన కార్యాలయంలో గనుల శాఖ అధికారుల సమక్షంలో ఆయ‌న‌ చార్జ్‌ తీసుకున్నారు. అనంతరం గనుల శాఖ కార్యకలాపాలు, చేపట్టిన ప్రాజెక్టులు, కీలక అంశాలపై రెండు గంటలపాటు సమీక్ష చేశారు.
Advertisement
APMDCAndhra PradeshAP Police

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more