మోదీ దిశానిర్దేశంతో ఏపీలో 91 శాతం పైగా సీట్లు గెలుచుకోగలిగాం: పవన్ కల్యాణ్
- ఢిల్లీలో ఎన్డీయే సభా పక్ష నేతను ఎన్నుకునే కార్యక్రమం
- హాజరైన జనసేనాని పవన్ కల్యాణ్
- ఎన్డీయే నాయకుడిగా మోదీ పేరును బలపర్చిన వైనం
- దేశానికి మోదీ ఒక స్ఫూర్తి అని వెల్లడి
మోదీ స్ఫూర్తితోనే తాము ఏపీలో ప్రభంజనం సృష్టించగలిగామని చెప్పారు. మోదీ దిశానిర్దేశంతో రాష్ట్రంలో 91 శాతానికి పైగా సీట్లు గెలుచుకోగలిగామని అన్నారు.
ఎన్డీయే పక్ష నేతగా మోదీకి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, ఆయన వెనుక తామంతా ఉన్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మోదీ ప్రధానమంత్రి పీఠంపై ఉన్నంత వరకు భారత్ ఏ దేశానికి భయపడదని అన్నారు. మోదీ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు.