Vijayashanthi: 'నిప్పురవ్వ' తరువాత బాలయ్యతో అందుకే చేయలేదు: విజయశాంతి

Vijayashanthi Interview
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ లో నిన్నటితరం హీరోయిన్ గా విజయశాంతి ఒక వెలుగు వెలిగారు. ఇక్కడి స్టార్ హీరోలందరి సరసన ఆమె నటించారు. ఒకానొక దశలో ఇక్కడి నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచారు. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ఆమె తనదైన ముద్ర వేశారు. చిరంజీవి .. బాలకృష్ణ సరసన కథానాయికగా ఆమె ఎక్కువ సినిమాలలో కనిపించారు. 

అలాంటి విజయశాంతి 'నిప్పురవ్వ' సినిమా తరువాత బాలకృష్ణతో కలిసి నటించలేదు. అందుకు కారణం ఇదేనంటూ, అనేక కథనాలు వినిపిస్తూ వచ్చాయి. ఆ విషయాన్ని గురించి ఒక ఇంటర్వ్యూలో విజయశాంతి మాట్లాడుతూ, "బాలకృష్ణగారితో 'నిప్పురవ్వ' తరువాత నటించకపోవడానికి వేరే కారణమంటూ ఏమీ లేదు. ఆ సమయంలో నేను వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను" అని అన్నారు. 

" ఆ సమయంలోనే నేను లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు వరుసగా సైన్ చేయడం .. ఆ తరహా కథలే నాకు రావడం జరిగింది. దాదాపు నా సినిమాలు కూడా ఒక హీరో స్థాయి సినిమాలతో సమానంగా ఆడేవి. అప్పుడు నేను తీసుకున్న పారితోషికం కూడా ఎక్కువ. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హీరో ఇమేజ్ వస్తుందనీ .. యాక్షన్ సినిమాలు చేస్తాననీ .. అంత బిజీ అవుతానని నేనే అనుకోలేదు.  అందువల్లనే ఇక ఇతర హీరోలతో చేయలేకపోయాను" అని చెప్పారు.
Go Back to Shorts
Vijayashanthi
Chiranjeevi
Balakrishna
Nippuravva

More Telugu News