Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయన తల్లి సరోజినీదేవి ఆదివారం రాత్రి కరీంనగర్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు ఎస్కార్ట్‌తో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం ఇచ్చింది.
Phone Tapping Case
Radhakishan rao
Telangana

More Telugu News