గన్నవరం చేరుకున్న చంద్రబాబు... సీఎం, సీఎం అంటూ హోరెత్తించిన టీడీపీ శ్రేణులు

గన్నవరం చేరుకున్న చంద్రబాబు... సీఎం, సీఎం అంటూ హోరెత్తించిన టీడీపీ శ్రేణులు

Chandrababu arrives Gannavaram airport
  • ఏపీలో జూన్ 4న ఓట్ల లెక్కింపు
  • నేడు ఎగ్జిట్ పోల్స్ విడుదల
  • ఉత్సాహం మీదున్న టీడీపీ శ్రేణులు
  • ఎన్టీఆర్ భవన్ ను విద్యుత్ దీప కాంతులతో ముస్తాబు
జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు నేడు హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి తిరిగొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో ఉత్సాహంతో ఉన్న టీడీపీ శ్రేణులు గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికాయి. సీఎం, సీఎం అంటూ నినాదాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హోరెత్తించారు. అటు, పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ను భవన్ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. 

కాగా, చంద్రబాబుకు స్వాగతం పలకడానికి ఎయిర్ పోర్టుకు వచ్చిన వారిలో కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణప్రసాద్, బోడె ప్రసాద్ తదితరులు ఉన్నారు. వారందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు ఉండవల్లి నివాసానికి వెళ్లారు.
Advertisement
Chandrababu
TDP
Exit Polls
Andhra Pradesh

More Telugu News