సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు
- రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా దూరం
- అనారోగ్య కారణాలతో టూర్ రద్దు చేసుకున్న యూపీఏ చైర్ పర్సన్
- ప్రత్యేక అతిథిగా ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సోనియా ఈ టూర్ విషయంలో తన వ్యక్తిగత వైద్యుడి సలహా కోరారు. సోనియా ఆరోగ్యం దృష్ట్యా ఈ ప్రయాణం మానుకుంటేనే మేలని వైద్యుడు చెప్పడంతో తెలంగాణ టూర్ ను ఆమె రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా హాజరు కావడంలేదని ఏఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.