ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం... వాహనం లోయలోపడి 17 మంది మృతి
- కబీర్‌ధామ్ జిల్లాలో లోయలో పడిన వాహనం
- మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నట్లు గుర్తింపు
- బీడీ ఆకుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం
ఆకులు ఏరిన తర్వాత వారిని పికప్ వాహనం వెనక్కి తీసుకువస్తోంది. ఈ సమయంలో వాహనం లోయలోకి బోల్తా కొట్టింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా కుయ్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బైగా కమ్యూనిటీ ఎక్కువగా బీడీలు చేస్తుంది. బీడీ ఆకు కోసం వీరు అడవులకు వెళుతుంటారు. ఈ ఆకులు మార్చి నుంచి మే మధ్య వస్తాయి.