81.86 శాతం ఓటింగ్ జరగడం ఆనందం కలిగించింది: పవన్ కల్యాణ్
- ఏపీలో పోలింగ్ పై పవన్ కల్యాణ్ ప్రకటన
- ఓటింగ్ ప్రక్రియలో ప్రజలు పెద్దఎత్తున భాగస్వామ్యం అయ్యారన్న పవన్
- ప్రజలు చూపించిన ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడి
"ఈ నెల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూపించిన ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు. సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయినందుకు అభినందనలు. అత్యధికంగా 81.86 శాతం ఓటర్లు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది.
ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అధికారులు, అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే, ఎన్నికల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా, పౌర సంఘాలు పోషించిన బాధ్యతాయుత పాత్రకు ధన్యవాదాలు" అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.