'కన్నప్ప'లో ప్రభాస్ .. రెమ్యునరేషన్ హాట్ టాపిక్!
- ముగింపు దశలో ఉన్న 'కన్నప్ప' చిత్రీకరణ
- ప్రభాస్ సీన్స్ పై జరుగుతున్న షూటింగ్
- రెమ్యునరేషన్ లేకుండా చేస్తున్న ప్రభాస్
- పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న సినిమా
'కన్నప్ప' సినిమాను వివిధ భాషల్లో .. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి ఈ సినిమాలో ప్రభాస్ మెరవనున్నాడు. ఆయన ఏ పాత్రలో కనిపించనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ తీసుకున్న పారితోషికం ఎంత? అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్ కి తగినట్టుగా ఆయన ఎంత తీసుకుని ఉండొచ్చుననే చర్చలు నడుస్తున్నాయి.
ఈ ఉహాగానాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అన్ని కోట్లు .. ఇన్ని కోట్లు అని చెప్పుకుంటున్నారు. అయితే ప్రభాస్ అసలు ఈ సినిమాలో చేసినందుకు పారితోషికం తీసుకోలేదని సమాచారం. కేవలం మోహన్ బాబు ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆయన ఇలా గెస్టు రోల్ చేయడానికి అంగీకరించాడని అంటున్నారు. ప్రభాస్ ఎంత చిన్న రోల్ చేసినా అది ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంటుందనే విషయంలో సందేహం లేదు.