ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్: గెలిస్తేనే సీఎస్కే చాన్సులు పదిలం!
- చెన్నైలో సీఎస్కే × రాజస్థాన్ రాయల్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
- ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని కోరుకుంటున్న చెన్నై జట్టు
- ఈ మ్యాచ్ లో ఓడితే సీఎస్కే ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం
ప్లే ఆఫ్ బెర్తును దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఎంతో కీలకం. సీఎస్కే ఇప్పటిదాకా టోర్నీలో 12 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
అయితే, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా 12 మ్యాచ్ లు ఆడి 6 విజయాలతో ప్లే ఆఫ్ బెర్తు రేసులో ఉన్నాయి. చెన్నై ఇవాళ్టి మ్యాచ్ తో పాటు మరో మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది.
నేడు రాజస్థాన్ చేతిలో ఓడితే మాత్రం చెన్నై అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. అందుకే నేడు సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో పోరులో చావోరేవో అన్నట్టుగా పోరాడే అవకాశాలున్నాయి. అయితే, టాస్ ఓడిపోవడం చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రతికూలంగా మారనుంది.