ఏపీలో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు

ఏపీలో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు

Heavy rain alert for AP
  • కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
  • పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
  • కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, నెల్లూరు, బాపట్ల, అల్లూరి, చిత్తూరు, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 

అదే సమయంలో సత్యసాయి, విజయనగరం, ప్రకాశం, మన్యం, కాకినాడ, వైఎస్సార్ కడప, అనకాపల్లి, అనంతపురం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు. 

ఉరుములతో కూడి వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు, రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని రోణంకి కూర్మనాథ్ వివరించారు. 

కాగా, ఇవాళ ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిశాయని వెల్లడించారు. సాయంత్రం 6 గంటల సమయానికి తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో 124.5 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా మండపేటలో 120.5, రాజమండ్రిలో 92, కోనసీమ జిల్లా తాటపూడిలో 75.5, ఏలూరు జిల్లా నూజివీడులో 73.5, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూర్మనాథ్ తెలిపారు.
Advertisement
Heavy Rains
Weather
Andhra Pradesh

More Telugu News