summer heat: స్మిమ్మింగ్ పూల్ లో కోతుల జలకాలు.. వీడియో ఇదిగో..

Watch Monkeys take a dip in Mumbai swimming pool amid soaring temperatures the Internet reacts
షార్ట్స్‌లో చూడండి
దేశంలో ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ వేడిని మనుషులే తట్టుకోలేకపోతున్నారు. మరి పాపం.. మూగ జీవుల సంగతేంటి? అవి మరింతగా విలవిల్లాడుతున్నాయి. ఒంటిని చల్లబరుచుకొనే మార్గాలను వెతుకుతున్నాయి.

అందుకే ముంబైలోని బోరీవలీలో ఉన్న ఓ స్విమ్మింగ్ పూల్ కనిపించగానే అక్కడి కోతులు ఎగిరి గంతేశాయి. కాసేపు సేదతీరదామని జలకాలు ఆడాయి. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో ముందు మూడు కోతులు స్విమ్మింగ్ పూల్ లోకి దూకాయి. ఒకదానితో ఒకటి చేతులు పట్టుకొని ఈత కొట్టాయి. అనంతరం పక్కనే ఉన్న మరో పూల్ లోకి ఇంకొన్ని కోతులు వచ్చి చేరాయి. ఈ వీడియోకు ‘ఎక్స్’లో 16 వేలకు పైగా వ్యూస్ లభించాయి.

దీనిపై యూజర్లు హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు. ఈత కొట్టడం కోతుల సహజ ప్రవృత్తి అని ఓ యూజర్ కామెంట్ చేయగా మరొకరేమో మనుషులకన్నా కోతులే స్విమ్మింగ్ పూల్ లో పద్ధతిగా ప్రవర్తిస్తున్నాయని వ్యాఖ్యానించాడు. ఈసారి కోతులు సరదా కోసం పిల్లల సైకిళ్లు నడుపుతాయేమోనని కామెంట్ పెట్టాడు. ‘ఈ దృశ్యం ఎంత బాగుంది. ఎంతైనా ఇది మనం కొట్టేసిన వాటి భూభాగమే కదా. జై బజరంగ్ బలీ’ అంటూ పోస్ట్ చేశాడు. 


Go Back to Shorts
summer heat
monkeys
swimming pool
dip
mumbai

More Telugu News