Chhattisgarh: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో న‌లుగురు మావోయిస్టుల హ‌తం!

Four Maoists killed in Encounter in Chhattisgarh
షార్ట్స్‌లో చూడండి
ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రోసారి తుపాకుల మోత మోగింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో న‌లుగురు మావోయిస్టులు హ‌తమ‌య్యారు. నారాయ‌ణ్‌పూర్ జిల్లా అబుజ్ మ‌డ్ అట‌వీ ప్రాంతంలో పోలీసులు, న‌క్స‌ల్స్ మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో న‌లుగురు న‌క్స‌ల్స్ మృతిచెందారు. ఘ‌ట‌నాస్థ‌లి నుంచి పోలీసులు భారీ మొత్తంలో తుపాకులు, పేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఇంకా కాల్పులు కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం. ఈ కాల్పుల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Chhattisgarh
Encounter
Maoists

More Telugu News