'స్వయంవరం' సెట్ లో స్టూలు చూడగానే విసుగొచ్చేది: లయ
Add ap7am to your home Screen

'స్వయంవరం' సెట్ లో స్టూలు చూడగానే విసుగొచ్చేది: లయ

Laya Interview
  • 'స్వయంవరం' సినిమాతో మెరిసిన లయ 
  • పాతికేళ్లు పూర్తిచేసుకున్న సినిమా 
  • హీరో హైట్ విషయంలో ఇబ్బంది పడ్డానని వెల్లడి
  • స్టూల్ కష్టాలు గుర్తుచేసుకున్న లయ  

తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా  నిలదొక్కుకోవడం అంత తేలికైన విషయమేం కాదు అనుకునే సమయంలో లయ ఇండస్ట్రీకి వచ్చింది. 'స్వయం వరం' సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయమైంది. వేణు హీరోగా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా, 25 ఏళ్లను పూర్తిచేసుకుంది. 'మహా మ్యాక్స్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమా ముచ్చట్లను లయ ప్రస్తావించింది.

రాఘవేంద్రరావు గారు అప్పట్లో 'స్టార్ 2000' అనే కాంటెస్ట్ ను నిర్వహించారు. ఆ కంటెంట్స్ లో ఫస్టు వచ్చిన వారిని ఆయన 'పరదేశి' సినిమా కోసం తీసుకున్నారు. ఆ కాంటెస్ట్ లో నేను సెకండ్ వచ్చాను .. అందువలన నాకు అవకాశాలు వస్తుండేవి. ఫస్టు రానందుకు నేను బాధపడలేదు. ఎందుకంటే నేను సినిమాల్లోకి రావాలని సీరియస్ గా అనుకోలేదు. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను అంతే" అని చెప్పింది. 

"కాంటెస్ట్ లో సెకండ్ వచ్చాను గనుక, చాలా మంది తమ సినిమాల కోసం అడుగుతూ ఉండేవారు. అలా నాకు వచ్చిన సినిమానే 'స్వయం వరం'. హీరో వేణు గారు 6 అడుగుల పైన ఉండేవారు. ఆయన హైట్ తో నన్ను మ్యాచ్ చేయవలసి వచ్చేది. అందుకోసం సైజుల వారిగా స్టూల్స్ తెప్పించేవారు .. నన్ను స్టూల్ ఎక్కించేవారు. సెట్ కి వెళ్లగానే స్టూల్ కనిపించగానే 'అబ్బా' అంటూ నాకు విసుగు వచ్చేది. షూటింగు పూర్తయిన తరువాత హమ్మయ్యా ఇక స్టూల్ బాధ తప్పింది అనుకున్నాను" అంటూ నవ్వేసింది. 
Advertisement
Laya
Actress
Venu
Swayamvaram

More Telugu News