Pawan Kalyan: చెల్లెలి బట్టలపై కామెంట్లు చేసే దిగజారుడు వ్యక్తి ఈ ముఖ్యమంత్రి: పవన్ కల్యాణ్

Pawan Kalyan fires on CM Jagan
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ మరోసారి గెలిస్తే రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఉండదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో వారాహి విజయభేరి సభకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. సొంతచెల్లెలు వేసుకున్న బట్టలపైనే కామెంట్లు చేసే దిగజారుడు వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని ఘాటుగా విమర్శించారు. 

"చెల్లెలి బట్టలను ఎవరైనా చూస్తారా? ఫలానా రంగు దుస్తులు వేసుకుంటే ఎవరైనా, ఏమైనా అంటామా? గ్రీన్ కలర్ పై ద్వేషం ఉంటే పచ్చని చెట్లను చూడడం మానేస్తామా? పసుపు రంగు చొక్కాలపై కోపంతో బంతిపూల దండలను దేవుళ్లకు, విగ్రహాలకు వేయడం మానేస్తామా? ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి? 

ఇతడు ఎంత దిగజారుడు వ్యక్తి అంటే... మా ఇంట్లో నా భార్యను అన్నాడు, చంద్రబాబు గారి భార్యను అన్నాడు, నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు... ఇవాళ ఇంకా దిగజారిపోయి సొంత చెల్లెల్ని తిడుతున్నాడు. వివేకా కూతుర్ని తిడుతున్నాడు" అంటూ పవన్ మండిపడ్డారు.
Go Back to Shorts
Pawan Kalyan
Jagan
YS Sharmila
Razole
Varahi Vijayabheri
Janasena
YSRCP

More Telugu News