Soubin Shahir: హాట్ స్టార్ ఫ్లాట్ ఫామ్ పైకి 'మంజుమ్మల్ బాయ్స్'

Manjummel Boys OTT release date confirmed
  • యథార్థ సంఘటన ఆధారంగా 'మంజుమ్మల్ బాయ్స్'
  • మలయాళంలో రికార్డు క్రియేట్ చేసిన సినిమా 
  • తెలుగులోను భారీ వసూళ్లను రాబట్టిన కంటెంట్ 
  • మే 3వ తేదీ నుంచి జరగనున్న స్ట్రీమింగ్  

మలయాళంలో ఇటీవల వచ్చిన 'మంజుమ్మల్ బాయ్స్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ఎప్పుడు థియేటర్లకు వస్తుందా అని ఈ మధ్య కాలంలో ఇక్కడి ప్రేక్షకులు వెయిట్ చేసిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమా ఇక్కడ కూడా గట్టిగానే సందడి చేసింది. ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నవాళ్లు కూడా చాలామంది ఉన్నారు.

అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్' వారు దక్కించుకున్నారు. మే 3వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా హాట్ స్టార్ వారు అధికారికంగా ప్రకటించారు. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమా, 20 కోట్లతో నిర్మితమై 250 కోట్ల వరకూ వసూలు చేయడం విశేషం. ఈ ఏడాదిలో విడుదలైన సినిమాలలో ఇంత మొత్తం సాధించినది ఇదే. 

మలయాళంతో పాటు, తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లోని ప్రేక్షకులను ఈ సినిమా పలకరించనుంది. 2006లో కొడైకెనాల్ లో జరిగిన యథార్థ సంఘటనకు ఇది దృశ్య రూపం. ఈ సినిమాలో చూపించిన గుహ బయట భాగం .. లోపలి భాగం సెట్. కానీ ఎవరూ కూడా అది సెట్ అనుకోరు. ఆ గుహ లోపల అలాగే ఉండి ఉంటుందని అనుకుంటారు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి ఒక రేంజ్ రెస్పాన్స్ లభించే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News