నా భర్త ఇంకో అమ్మాయిని ప్రేమించాడు: స్నేహ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా భర్త ఇంకో అమ్మాయిని ప్రేమించాడు: స్నేహ

My husband loved another woman says Sneha
  • తమిళ నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకున్న స్నేహ
  • మరో అమ్మాయితో తన భర్తకు బ్రేకప్ అయిందని వెల్లడి
  • బ్రేకప్ కాకపోతే ప్రసన్న తనకు భర్తగా దొరికేవాడు కాదన్న స్నేహ
తెలుగు సినీ పరిశ్రమకు దొరికిన అచ్చ తెలుగు హీరోయిన్లలో స్నేహ ఒకరు. తన అందచందాలతో ప్రేక్షకులను మెప్పించిన స్నేహ అసలు పేరు సుహాసిని రాజారామ్ నాయుడు. ముంబైలో తెలుగు కుటుంబంలో జన్మించిన స్నేహ... దుబాయ్ లో పెరిగారు. ఆ తర్వాత సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. మన పక్కింటి అమ్మాయిలా కనిపించే స్నేహ... తక్కువ టైమ్ లోనే మంచి నటిగా గుర్తింపు పొందారు. తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు.  

తమిళ సినీ నటుడు ప్రసన్నను 2021లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు తన భర్త ప్రసన్న గురించి ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. గతంలో తన భర్త మరో అమ్మాయిని ప్రేమించాడని, కానీ వారికి బ్రేకప్ అయిందని చెప్పారు. ఆ ప్రేమ వల్ల తనకు ఎలాంటి సమస్య లేదని... వారు బ్రేకప్ కాకపోతే ప్రసన్న తనకు భర్తగా దొరికే వాడు కాదని అన్నారు. 

భార్యాభర్తలకు ఒకరికపై మరొకరికి నమ్మకం ఉండాలని... లేకపోతే కలిసి బతకడం కష్టమవుతుందని చెప్పారు. బయటకు ఎందుకు వెళ్తున్నావు, ఈ సమయంలో బయటకు ఎందుకు? వంటి ప్రశ్నలు తలెత్తకూడదని అన్నారు. మనల్ని అవతలి వ్యక్తి సరిగా అర్థం చేసుకుంటే ఇలాంటి ప్రశ్నలు రావని చెప్పారు. పొసెసివ్ నెస్ ఉండాలే కానీ... అది అతిగా ఉండకూడదని అన్నారు. 
Advertisement
Sneha
Tollywood
Husband
Prasanna
Love

More Telugu News