కింగ్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఐపీఎల్ రికార్డు
- రాజస్థాన్ రాయల్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన విరాట్
- గత రాత్రి సెంచరీతో 731కి చేరిన మొత్తం పరుగులు
- శిఖర్ ధావన్‌ను వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచిన స్టార్ బ్యాట్స్‌మెన్
రాజస్థాన్ రాయల్స్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీళ్లే..
1. విరాట్ కోహ్లీ - 29 మ్యాచుల్లో 731 పరుగులు
2. శిఖర్ ధావన్ - 24 మ్యాచుల్లో 679 పరుగులు
3. ఏబీ డివిలియర్స్ - 20 మ్యాచుల్లో 652 పరుగులు
4. కేఎల్ రాహుల్ - 15 మ్యాచుల్లో 637 పరుగులు
5. సురేష్ రైనా - 23 మ్యాచుల్లో 630 పరుగులు
ఇక విరాట్ కోహ్లీ శనివారం రాత్రి ఐపీఎల్ 2024లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో 316 పరుగులు చేసిన కోహ్లీ ఆరెంజ్ క్యాప్ ప్లేయర్‌గా (అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు) కొనసాగుతున్నాడు. మరోవైపు గత రాత్రి రాజస్థాన్‌పై మ్యాచ్‌లో బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మొదటి వికెట్‌కు ఏకంగా 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సాధించారు. ఎక్కువసార్లు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన బెంగళూరు జోడీగా వీరిద్దరూ నిలిచారు.
ఐపీఎల్లో 100 పరుగుల కంటే ఎక్కువ భాగస్వామ్యాలు..
1. డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ - 6
2. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో - 5
3. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ - 5
4. మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ - 4
4 - రుతురాజ్ గైక్వాడ్ & డెవాన్ కాన్వే
5. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ - 4